ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షలు సరిపోవడం లేదు: కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు

By

Published : Jan 1, 2023, 1:11 PM IST

NTR District Collector S.Dilli Rao Comments: అనుకున్న పలితాలు సాధించాలంటే ఆర్థిక వనరులతో పాటు.. సరైన ప్రాంతాలను ఎంపిక చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్​ ఢిల్లీరావు. అంతేగానీ మొక్కుబడిగా పనులను చేపడితే.. లక్ష్యాలు చేరుకోలేమని స్పష్టం చేశారు.

కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు
కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

NTR District Collector S.Dilli Rao Comments: పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా యూనిట్‌కు ప్రభుత్వం ప్రకటించిన ధర రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో లక్ష్యాల మేరకు నిర్మాణాల్లో పురోగతి సాధించలేకపోయామని, ఇప్పటివరకు కేవలం 6 వేల ఇళ్లు మాత్రమే పూర్తిచేయడం కొంత అసంతృప్తిని మిగిల్చిందని పేర్కొన్నారు.

కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

ప్రస్తుత ధరలకు ప్రభుత్వం నిర్ణయించిన వ్యయం సరిపోకపోవడం, విజయవాడ నగరం పరిధిలోని లేఅవుట్లు దూరంగా ఉండటం.. తదితర కారణాలతో లబ్ధిదారులు నిర్మాణంలో భాగస్వాములు కాలేకపోతున్నారని చెప్పారు. 2022లో అనుకున్న కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోవడానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమే కారణమని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details