ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jaibheem Party: వివేకా హత్య కేసు.. సీబీఐకి జడ శ్రవణ్ కుమార్ లేఖ.. ఏం రాశారంటే..?

By

Published : Apr 26, 2023, 10:45 PM IST

Updated : Apr 26, 2023, 10:58 PM IST

Jaibheem Party cheif Jada Shravan Kumar wrote to CBI: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి లేఖ రాశారు. ఆ లేఖలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల గురించి పలు కీలక విషయాలను పేర్కొన్నారు.

Jaibheem
Jaibheem

Jaibheem Party cheif Jada Shravan Kumar wrote to CBI: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి లేఖ రాశారు. ఆ లేఖలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల గురించి పలు కీలక విషయాలను పేర్కొన్నారు.

సీబీఐకీ జడ శ్రావణ్ కుమార్ లేఖ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు దర్యాప్తు సంస్థ (సీబీఐ) గతకొన్ని రోజులుగా దర్యాప్తులో వేగం పెంచిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధమున్న వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ హత్య జరిగిన రోజు ఏం జరిగింది..? అనే విషయాలపై విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించే సమాచారం ఏదైనా ఉంటే వెంటనే సేకరించాలని సీబీఐని కోరారు.

ఆ సమాచారాన్ని, ఆధారాలను సీబీఐ సేకరించాలి.. జడ శ్రావణ్ కుమార్ లేఖ ప్రకారం.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారంటూ.. రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి నిర్దోషి అంటూ చేసిన వ్యాఖ్యలపై వారి దగ్గర ఉన్న సమాచారాన్ని, ఆధారాలను సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి, సేకరించాలని.. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ని జడ శ్రవణ్ కుమార్ కోరారు. అంతేకాదు, సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం.. వారి దగ్గర ఉన్న నేర సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి తెలియజేయాల్సిన కనీస బాధ్యత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఉందని ఆయన గుర్తు చేశారు.

అలా కోరడంలో తప్పు ఏమీ లేదు..అనంతరం తక్షణమే 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసి, వారి దగ్గర ఉన్న సమాచారంతో వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించే సమాచారాన్ని సేకరించి, ఈ కేసును ఛేదించాల్సిందిగా లేఖలో కోరారు. దీంతోపాటు బ్రహ్మయ్య అండ్ కోలో ఆడిటర్‌గా పనిచేసే శ్రవణ్ అనే వ్యక్తిని తప్పుగా అరెస్టు చేశారన్న విషయాన్ని కూడా ఆయన లేఖలో వివరించారు. తనకు 160 నోటీసులు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని.. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐకి ఇవ్వాలని కోరడంలో తప్పు ఏమీ లేదని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 26, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details