ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jai Bheem Party Round table meeting on R5 zone: ఆర్‌-5 జోన్‌ ఇళ్ల పట్టాలంటూ జగన్ నిరుపేదలను మోసం చేశారు: అఖిలపక్ష నేతలు

By

Published : Aug 12, 2023, 9:26 PM IST

Round table meeting on housing sites in R5 zone: ఆర్‌-5 జోన్‌‌లో ఇళ్ల పట్టాలంటూ సీఎం జగన్ 42,017 మంది నిరుపేదలను దారుణంగా మోసం చేశారని.. అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దగా పడ్డ పేదన్న.. మా ఇల్లెక్కడ జగనన్నా' పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన నేతలు.. తీర్మానాలను వెల్లడించారు.

Roundatable_Meeting_on_R5_Zone_2023
Roundatable_Meeting_on_R5_Zone_2023

Jai Bheem Party Round table meeting on R5 zone: ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. నిరుపేదలను దారుణంగా మోసం చేశారని.. అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన 42,017 మంది నిరుపేదలకు వారి వారి సొంత నియోజకవర్గాలలో మూడు సెంట్ల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో సీఎం జగన్.. దళితుల ద్రోహిగా, నిరుపేదల ద్రోహిగా చరిత్రలో నిలిపోతారని వ్యాఖ్యానించారు.

Round Table Conference on R-5 Zone.. జైభీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో 'దగా పడ్డ పేదన్న.. మా ఇల్లెక్కడ జగనన్నా' అనే పేరుతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం సహా వివిధ రాజకీయ పక్షాల నాయకులు, అమరావతి ఐకాస ప్రతినిధులు, ఉద్యమ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశంలోఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు, పట్టాలు, మూడు సెంట్ల భూమిని పంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. పలు కీలక తీర్మానాలు చేశారు.

రాజధాని భూములపై కక్ష.. పేదలపై వివక్ష.. : సీఎం జగన్​పై రైతుల మండిపాటు

Akhilapaksha announced the resolutions.. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన 42,017 మంది నిరుపేదలకు వారి వారి సొంత నియోజకవర్గాలలో మూడు సెంట్ల భూమిని పంపిణీ చేయాలని అఖిలపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు. నిరుపేదలు, ప్రజలకు కోర్టు కేసుతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి, పంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 10 లక్షల హెక్టార్ల ప్రభుత్వ భూమి నుంచి భూ పంపిణీ జరగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 42,017 మంది నిరుపేదలను మోసం చేయకుండా.. మూడు సెంట్ల స్థలంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలను వెంటనే నిర్మించాలని తీర్మానాలు చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన నిరుపేదలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని నేతలు పేర్కొన్నారు.

Houses proposals in R5 zone ఆర్-5 జోన్‌ ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ప్రతిపాదనలు..

Jada Shravan fire on CM Jagan..జైభీమ్‌ భారత్‌ పార్టీ అధినేత జడ శ్రావణ్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..''ఆర్‌-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లోనూ ఈ అంశాన్ని పొందుపరిచింది. కానీ, ఈ జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే.. అర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. కాబట్టి ఈ 42,017మంది నిరుపేదలకు వారి సొంత నియోజకవర్గాల్లో మూడు సెంట్ల భూమిని కేటాయించి..డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని అన్నారు.

TDP leader Pattabhiram comments.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మాట్లాడుతూ..పేదలకు ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాల విషయంలో సీఎం జగన్‌ చేసిన ప్రకటనలు అవాస్తవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేళ్ల కాలంలో పీఎమ్‌ఏవై (PMAY) కింద కేవలం 2,172 ఇళ్లు నిర్మించారని వివరాలను వెల్లడించారు. జగనన్న కాలనీల పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించి..ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమరావతిని కుట్రపూరితంగా నాశనం చేయాలనే దుర్భుద్ధితోనే ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఇది కరెక్ట్ కాదని పట్టాభి హితవు పలికారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలనే నిర్ణయానికి మా పార్టీలు కట్టుబడి ఉంది. దళితుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల పక్షాన అవసరమైతే సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వితో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో నిరుపేదలు అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేందుకు తగిన స్థలం లేకుండా చేయాలనే కుట్రతోనే ఆర్‌-5 జోన్‌ను సృష్టించారు. ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం జగన్ తాను చేసిన తప్పును తెలుసుకుని నిరుపేదలకు న్యాయం చేయాలి.- అఖిల పక్షాల నేతలు

AP Govt approached Supreme Court on R5 zone: అమరావతి ఆర్-5 జోన్‌ అంశంపై సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన రాష్ట్రప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details