ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్ధృతంగా కృష్ణానది.. తెప్పోత్సవంపై తర్జనభర్జనలు

By

Published : Oct 3, 2022, 7:38 PM IST

TEPPOTSAVAM: ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా విజయవాడ కనకదుర్గమ్మకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. కానీ.. కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ కార్యక్రమంపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు అధికారులతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.

TEPPOTSAVAM
బెజవాడ దుర్గమ్మ

TEPPOTSAVAM: విజయదశమి రోజు నిర్వహించే అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. నదిలో 30 వేల క్యూసెక్కులలోపు నీరు ఉంటేనే జలవిహారానికి అనుమతి ఉంటుందని.. ఈ కార్యక్రమానికి నీటి పారుదులశాఖ అనుమతి లభించాల్సి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. దశమి రోజు నీటి ప్రవాహాన్ని బట్టి.. అనుమతిస్తే తెప్పోత్సవం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతులు రాకుంటే నది ఒడ్డులోనే ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. జలవిహారం నిర్వహణపై రేపు అధికారులతో సమన్వయ కమిటీ భేటీ అయి నిర్ణయం ప్రకటించనుంది.

మూలా నక్షత్రం రోజున సుమారు రెండున్నర లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏడు రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని.. ఎనిమిదవ రోజు అమ్మవారు కనకదుర్గమ్మ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుందని అన్నారు. విజయదశమి రోజున 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. 100 రూపాయలు, 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను విజయదశమి రోజున రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details