ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్​జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 7:38 PM IST

Updated : Dec 5, 2023, 9:00 PM IST

Cyclone Michaung Effect on Crops: మిగ్​జాం తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారు. కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల కోసిన వరి పనలు ఇంటికి తరలించే సమయం లేక పొలాల్లోనే ఉంచారు. వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి. దీంతో రైతులంతా పంటను కాపాడుకునేందుకు నానావస్థలు పడుతున్నారు.

Cyclone_Michaung_Effect_on_Crops
Cyclone_Michaung_Effect_on_Crops

వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్​జాం' - నిండా మునిగి దిక్కుతోచని అన్నదాత

Cyclone Michaung Effect on Crops: మిగ్​జాం తుపాను ఎన్టీఆర్ జిల్లాలో రైతుల వెన్ను విరిచింది. వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్న పంటలు నీట మునిగాయి. వరిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతల ఆశలు నీరుగారాయి. ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికొచ్చే సమయానికి తుపాను విరుచుకుపడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Michaung Effect on Crops in NTR District: ఈ ఏడాది రైతులకు సాగు కలిసి రాలేదు. మొన్నటి వరకు వర్షాభావంతో అల్లాడిన రైతులు పంటలను ఎలాగోలా కష్టపడి ఒడ్డుకు చేర్చారు. తీరా పంటలు కోతకు వచ్చే సమయంలో మిగ్​జాం తుపాను(Michaung Cyclone) రూపంలో దురదృష్టం వెంటాడింది. మిగ్​జాం తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి.

తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం - బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలి : చంద్రబాబు

Crop Loss Due to Heavy Rains: వరి పనలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. కొన్నిచోట్ల కోసిన వరి పనలు ఇంటికి తరలించే సమయంలేక పొలాల్లోనే ఉంచారు. ఇప్పుడు వీరంతా అరచేతిలో గుండెలు పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. వరి పనలు ప్రస్తుతం నీటిలో తేలియాడుతుండగా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వాటి నుంచి మొలక వస్తుందనే భయం రైతులను వెంటాడుతోంది.

కొందరు రైతులు ముందే పంట కోసినప్పటికీ ఆరబెట్టుకునే సమయం లేక ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచారు. ఈ రైతులంతా తుపాను ప్రభావంతో వరి పంటను కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి సాగు చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో మిగ్​జాం తుపాను కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు వాపోతున్నారు.

రైతులను కష్టాల కొలిమిలోకి నెట్టిన మిగ్​జాం - ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం

Michaung Effect on Crops: కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కౌలు కూడా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే మిగిలిన పంట కూడా దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు నీటమునిగిన వరిచేలను కాపాడుకునేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు.

Farmers Worried About Crop Loss: పొలాల్లో నుంచి నీటిని మళ్లించడంతోపాటు కిందపడిన వరి పనలను పైకెత్తి కడుతున్నారు. మరో వారం రోజుల్లో పంట చేతికొచ్చే తరుణంలో ఇలాతుపాను రావడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అనుకోని ఆపదతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

రైతులను అప్రమత్తం చేయడంలో వైసీపీ సర్కారు విఫలం : నిమ్మల

Last Updated :Dec 5, 2023, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details