ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలి: సీఐటీయూ

By

Published : Dec 16, 2022, 5:32 PM IST

Municipal Employees Poster Release: ప్రభుత్వం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 14వ మహాసభలు ఈనెల 20న అనంతపురంలో జరగనున్నాయి. ఈ క్రమంలో విజయవాడ ఎంబీవీకే భవన్‌లో మహాసభల గోడ పత్రికను ఫెడరేషన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సమావేశంలో పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

poster release
మహాసభల గోడ పత్రిక

Municipal Employees Poster Release: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర 14వ మహాసభలు ఈనెల 20న అనంతపురంలో జరగనున్నాయి. విజయవాడ ఎంబీవీకే భవన్‌లో మహాసభల గోడ పత్రికను ఫెడరేషన్ ప్రతినిధులు విడుదల చేశారు. అనంతపురంలో జరిగే ఫెడరేషన్ మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్​ కార్యాచరణ రూపొందిస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు తెలిపారు.

మహాసభల గోడ పత్రికను విడుదల చేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్

"ప్రభుత్వం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన జగన్.. వాటిని నిలబెట్టుకోవాలి" - ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details