ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది : సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 3:17 PM IST

Citizens for Democracy Meeting Updates: పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సంస్కరణలు చాలా అవసరమని గుర్తు చేశారు. అహం, రాజకీయ ఆవేశాలు పక్కనబెట్టి, పోలీసు యంత్రాంగాన్ని, వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేసుకునేలా స్వేచ్ఛ కల్పించాలని కోరారు.

cfd_meeting_updates
cfd_meeting_updates

Citizens for Democracy Meeting Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సంస్కరణలు చాలా అవసరమని, ముఖ్యంగా బదిలీలు, అపాయింట్‌మెంట్‌లు సక్రమంగా జరిగితే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. అహం, రాజకీయ ఆవేశాలు పక్కనబెట్టి, పోలీసు యంత్రాంగాన్ని వాళ్ల పని వాళ్లను సక్రమంగా చేసుకునేలా స్వేచ్ఛను కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టమని నేతలు వ్యాఖ్యానించారు.

పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది : సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

Nimmagadda Ramesh Kumar comments: ''నాకు పోలీసు వ్యవస్థపైనా అపారమైన గౌరవం, విశ్వాసం, నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా విధులు నిర్వర్తిసుంటారు. పై అధికారుల ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తారు. అందుకే ఈరోజు వ్యవస్థ ఇలా ఉంది. అయితే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా ఒకరే అధికారంలో ఉండరు. ప్రజల ఆమోదం ఉన్నంతవరకే పాలకులు. పక్క రాష్ట్రంలో ఎన్నికైన సీఎం స్పష్టంగా చెప్పారు. 'మేం ప్రజా పాలకులం కాదు-ప్రజా సేవకులం' అని అది స్ఫూర్తిదాయకమైన మాట. అహం, రాజకీయ ఆవేశాలు పక్కనబెట్టాలి. పోలీసు యంత్రాంగం వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేసుకునేలా స్వేచ్ఛ కల్పించాలి. మీకు కావాల్సిన పంథాలోనే యంత్రాంగం పనిచేయాలంటే మోజేష్‌ లాంటి మరణాలు పునరావృతమవుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.'' అని ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.

వైసీపీ పాలన అరాచకం - సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ రౌండ్​టేబుల్​లో బాధితులు

Citizens for Democracy on Protests: నిరసన చేసే హక్కు ప్రజలందరికీ ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సభ్యులు గుర్తు చేశారు. నిరసనలు చేస్తేనే కదా సమస్యలు పరిష్కారమయ్యేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. నిరసనలు చేస్తే పోలీసులు కేసులు బనాయించడం ముమ్మాటికీ తప్పేనేనని వారు ఖండించారు. సమాజంలో మార్పులకు అనుగుణంగానే పరిస్థితులు మారుతున్నాయని, మంచి చేయాల్సిన ఉద్దేశం ఉన్న వాళ్లు కూడా చెడుగా మారిపోతున్నారని సభ్యులు ఆవేదన చెందారు. ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధానం లక్ష్యంగా సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముందుకు సాగుతోందని తెలిపారు.

ఏపీలో పోలీసుల వ్యవహారం కంచే చేను మేసిన చందం - మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్‌ వ్యవస్థకు రాజ్యాంగ ప్రాతిపదిక లేదు. రాజ్యాంగ ప్రకారం పంచాయతీలదే ప్రధాన బాధ్యత. గ్రామ స్వరాజ్యం విషయంలో కేరళ, రాజస్థాన్ ముందున్నాయి. దేశమంతా గ్రామ సభలు - ఏపీలో మాత్రం భజన సభలు. పంచాయతీల్లో సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా పోయింది. సర్పంచ్‌ల తరఫున సుప్రీం కోర్టులో కేసు వేశాం. ఏ కారణం చూపించకుండా అరెస్టులు, ఇబ్బడిముబ్బడిగా కేసుల నమోదు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, నాయకులకు అనుగుణంగా పనిచేసే దుస్థితి పోవాలి. తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఏం జరగలేదని మభ్యపెడితే ప్రయోజనమేంటి?. పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచాలి. -నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ మాజీ ఎన్నికల అధికారి

'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర'పై సిటిజన్స్‌ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details