ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇప్పటివరకు ఏపీకి రూ.23 వేల కోట్లు ఆర్థిక సాయం: కేంద్రం

By

Published : Dec 13, 2022, 7:39 PM IST

Delhi Financial help to AP: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 23వేల 110.472 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ రాజ్యసభకు తెలిపింది. చట్టంలోని పలు సెక్షన్లలో పేర్కొన్న విధంగా.. రెవెన్యూ లోటు భర్తీ కింద, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద, రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్​కు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పార్లమెంట్
Parlament

Financial help to AP: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 23వేల 110.472 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ రాజ్యసభకు తెలిపింది. చట్టంలోని పలు సెక్షన్లలో పేర్కొన్న విధంగా.. రెవెన్యూ లోటు భర్తీ కింద 5617.89 కోట్ల రూపాయలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద 1750 కోట్ల రూపాయలు, రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు, పోలవరం ప్రాజక్టు కోసం 13,226.772 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిన విదేశీ ప్రాజక్టులపై తీసుకున్న రుణాలకు 15.81 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపుల కోసం కూడా విడుదల చేసినట్లు తెలిపారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 2019-20 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌కు 4,199.55 కోట్లు విడుదల చేశామని కనకమేడల అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ సమాధానంలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details