ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతులకు పరిహారం చెల్లించాలి - రాష్ట్ర వ్యాప్తంగా కమలదళం నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 5:14 PM IST

BJP Leders Protest For Crop loss compensation : మిగ్​జాం తుపాను కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి రాష్టవ్యాప్తంగా రైతులు దీనమై పరిస్థితుల్లో ఉన్నారు. నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించాలంటూ బీజేపీ కార్యక్తలు పలు జిల్లాల్లో నిరసనలు నిర్వహించారు.

bjp_leders_protest_for_crop_loss_compensation
bjp_leders_protest_for_crop_loss_compensation

BJP Leders Protest For Crop loss compensation : మిగ్‌జాం తుపాన్ బాధిత రైతులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. గుంటూరు కలెక్టర్ వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా 'అన్నదాత ఆగ్రహం' పేరుతో ధర్నా చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మిగ్‌జాం తుఫాను హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట భాజపా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ కి నష్టపోయిన రైతులకి తక్షణమే నష్టపరిహారం అందించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

రైతులకు పరిహారం చెల్లించాలి - రాష్ట్ర వ్యాప్తంగా కమలదళం నిరసన

నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ

BJP Leders Protest For Crop loss compensation In Alluri District :మిగ్​జాం తుఫాను బాధితులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టరేట్​ను ముట్టడించారు. తుపాను ప్రభావంతో రైతులు రోడ్డున పడ్డారని ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కమలం కార్యకర్తలు మండిపడ్డారు. ఏజెన్సీ వ్యప్తంగా నలుగురు మృత్యువాత పడినప్పటికీ వారి కుటుంబాలకు ఎటువంటి పరిహారం చెల్లించటం గాని ఆదుకోవడం గాని ప్రభుత్వాలు చేయలేదని ఆరోపించారు. అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటూ ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటం సహా మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు

BJP Leders Protest For Crop loss compensation In Nellore : కేంద్రం విడుదల చేసిన నేషనల్ డిజాస్టర్ ఫండ్ వెయ్యి కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తుపాను భాదితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వెళ్లారు కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ మోర్చా ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ గాల్లో చక్కర్లు కొడుతూ పరదాలు చాటున తిరగడం తప్ప రైతులను ఆదుకోవడం లేదని భాజపా నేతలు దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో వరినార్లు, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో రైతులే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

తుపానుతో తడిసి ముద్దైన పంట- కోలుకునేలోపే పంపా రిజర్వాయర్ వల్ల పూర్తిగా నాశనం

BJP Leders Protest For Crop loss compensation In vijayawada :భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తుఫాను హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కిసాన్ మోర్చా నేతలు ఆరోపించారు. కౌలు రైతుల ను ఆదుకోవడంత పాటు రెండు రోజుల్లో రైతుల వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. వెంటనే పంట నష్టం ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరితోపాటు పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలని కోరారు. మురుగునీటి పారుదల వ్యవస్థను, నీటిపారుదల కాల్వలను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు.

మిగ్​జాం తుపాను వీడిన కర్షకులను కష్టాలు వీడలేదు-ప్రభుత్వ వైఫల్యమే కారణమని రైతన్నల ఆరోపణ

ABOUT THE AUTHOR

...view details