ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"అక్రమాలు జరక్కపోతే రుషికొండకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు"

By

Published : Oct 29, 2022, 2:11 PM IST

Atchennaidu: రుషికొండలో అక్రమాలు జరక్కపోతే అక్కడకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. మూడున్నరేళ్ల పాలనలో దోపిడీ వల్ల ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని విమర్శించారు. ఒక్క అవకాశంతో ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయని అచ్చెన్నాయుడు అన్నారు.

Atchennaidu
అచ్చెన్నాయుడు

Atchennaidu: విజయవాడలో పేదలకు అచ్చెన్న, గద్దె రామ్మోహన్​ తోపుడు బండ్లను అందించారు. విశాఖను జగన్‌ దోపిడీ రాజధానిగా మారుస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర మంత్రుల దోపిడీ ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. నేతల స్వార్థం కోసమే ప్రాంతీయ చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ బండారం బయటపడుతుందనే నిన్న అడ్డుకున్నారన్నారని ఆరోపించారు. రాజధాని ఏదో చెప్పలేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. జగన్‌ పాలనతో 40 ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందులలో కూడా గెలవలేని జగన్‌... 175 గెలుస్తామని భ్రమ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పే ఒక్క మంచి కారణం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఒక్క అవకాశంతో ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయని అన్నారు. పిచ్చివాళ్లే పొత్తులపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పొత్తులు సర్వసహజమన్నారు. ప్రజాస్వామ్య రక్షణకు కలిసొచ్చే పార్టీలను కలుపుకొంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అచ్చెన్నాయుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details