ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముగిసిన ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఎన్నికలు.. ఎవరెవరు ఎన్నికయ్యారంటే?

By

Published : Jan 18, 2023, 5:16 PM IST

Updated : Jan 18, 2023, 5:25 PM IST

APNGOs Elections are over: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో రాష్ట్ర సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కేవీ శివారెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి, తమ కార్యవర్గాన్ని బలపర్చిన ఉద్యోగులందరికీ నూతన అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

APNGO
ఏపీఎన్జీవో

ముగిసిన ఏపీఎన్జీవో ఎన్నికల ప్రక్రియ

APNGOs Elections are over: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో రాష్ట్ర సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కేవీ శివారెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్జీవో ఎన్నికల్లో పోటి చేసిన బండి శ్రీనివాసరావు ప్యానెల్ వర్గం.. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తమ కార్యవర్గాన్ని బలపర్చిన ఉద్యోగులందరికీ నూతన అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అధ్యక్షులు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐసీ, సరండర్ సెలవులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతికి పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలలో ఒక్కటి చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకూ అది అమలు కాలేదని గుర్తు చేశారు.

ఇప్పటికైనా డీఏ చెల్లింపుపై ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత వహించాలని సూచించారు. ప్రభుత్వంతో ఘర్షణకు దిగాలని తమకు గానీ, ఉద్యోగులకు గానీ లేదన్నారు. కానీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే దశల వారిగా పోరాటాలు చేయడానికి వెనకడబోమని హెచ్చరించారు. 11వ పీఆర్సీలోని ఉద్యోగుల నష్టాన్ని, 12వ పీఆర్సీలోనైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని సంఘ నూతన ప్రధాన కార్యదర్శి శివారెడ్డి కోరారు. మూడు ఏళ్లు దాటుతున్న ఇంకా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలేదని ఆగ్రహించారు. జీపీఎస్‌కు ఒప్పుకోనేది లేదని ఓపీఎస్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్జీవో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ఈరోజు జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక, ఉద్యోగుల పెన్షన్లు కోసం పోరాడుతున్న మమ్మల్ని గెలిపించడానికి రాష్ట్ర నలుమూలాల నుంచి విచ్చేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగులు రావాల్సిన రాయితీలు గానీ జీపీఎఫ్ గానీ జీఎల్‌ఐసీతోపాటు 11వ పీఆర్సీలో కూడా కొన్ని జీవోలు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే అన్నింటినీ విడుదల చేయాలి-బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు

ఇవీ చదవండి

Last Updated :Jan 18, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details