ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు ప్రధానికి కనిపించటం లేదా"

By

Published : Dec 7, 2022, 10:40 PM IST

Sunkara Padma Sri : రాష్ట్రంలో మహిళల పట్ల ప్రభుత్వం చేస్తున్న అరాచకలు ప్రధానికి కనిపించలేదా అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు పద్మశ్రీ ఆరోపించారు. వైద్య విద్యార్థిని తపస్వి హత్య దారుణమని అన్నారు.

Etv Bharat
Etv Bharat

Sunkara Padma Sri Comments : తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిలపై పోలీసుల ప్రవర్తన బాధించిందని చెబుతున్న ప్రధాని మోదీకి.. ఏపీలో మహిళల పట్ల వైసీపీ చేస్తున్న అరాచకాలు కనిపించలేదా అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉన్మాదులు మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్యార్థిని తపస్వినిని కిరాతకంగా హత్య చేయటం దారుణమని అన్నారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించాలన్నారు.

ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ

"వైయస్​ షర్మిల కారులో కూర్చోని ఉండగా కారును తీసుకెళ్లటం ఆయనకు బాధాకరంగా అనిపించింది అంటా. మరీ ఆంధ్రప్రదేశ్​లో ఉన్న మహిళల్ని జగన్​మోహన్​ రెడ్డి అవమానిస్తుంటే ప్రధానమంత్రి ఎందుకు స్పందించటం లేదు.''- సుంకర పద్మశ్రీ, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details