ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన న్యాయవాదిపైనే కేసు.. బెజవాడలో లాయర్ల ఆందోళనలు

By

Published : Mar 20, 2023, 7:18 PM IST

ADVOCATES PROTEST AT CIVIL COURTS: విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. భవానీపురం CI ఉమర్, ASI పై చర్యలు తీసుకోవాలని.. విజయవాడ సివిల్ కోర్టుల ఎదురుగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

ADVOCATES PROTEST AT CIVIL COURTS
ADVOCATES PROTEST AT CIVIL COURTS

ఫిర్యాదు చేయడానికి వెళ్లిన న్యాయవాదిపైనే కేసు

ADVOCATES PROTEST AT CIVIL COURTS: అతనొక న్యాయవాది. అన్యాయం జరిగిన బాధితులకు కోర్టులో వాదించి న్యాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కుమార్తె లైగింక వేధింపులకు గురవుతున్నట్లు పోలీస్​స్టేషన్​కు వెళ్తే.. పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. భవానీపురం సీఐ ఉమర్, ఏఎస్ఐ గంగాధర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయని పోలీసులు.. తిరిగి న్యాయవాది పైనే కేసు నమోదు చేశారని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

"సీఐ ఉమర్​ చట్టాన్ని తన చేతుల్లో ఉంచుకుని ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడి.. ఒక న్యాయవాది కుటుంబం అందులోనూ మైనర్​ బాలిక విషయంలోనే ఇలా చేస్తే.. ఇంకా సామాన్యుల విషయంలో ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారో ఆలోచించాల్సిన సమయం. మా లాయర్.. ఆ​ అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి నిలదీసి మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్తే.. వీళ్లని పోలీసుస్టేషన్​కు పిలిపించి వీళ్ల పైనే కేసులు నమోదు చేశారు. బాధితులకు అన్యాయం జరిగితే సీఐ మొదటి ముద్దాయి. సీఐని సస్పెండ్​ చేయడానికి అన్ని అధికారాలు ఉంటాయి. సీఐ ఉమర్​ను విధుల నుంచి వెంటనే తప్పించాలి. అప్పటి వరకూ ఈ సమ్మె ఆగదు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేస్తూనే ఉంటారు"-న్యాయవాది

రోడ్డుపై న్యాయవాదులు ఆందోళన చేపట్టడంతో కాసేపు ట్రాఫిక్​కి అంతరాయం కలిగింది. అనంతరం భవానీపురం సీఐ ఉమర్, ఏఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలకు డిమాండ్ చేయగా విచారణ జరిపి రెండు రోజుల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు.

తమ డిమాండ్లను నెరవేరుస్తామని కమిషనర్​ ఆఫ్​ పోలీసు హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. తమ న్యాయవాదిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. అలాగే భవానీపురం సీఐ ఉమర్​పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అతన్ని సెలవులపై ఇంటికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ హామీలన్నీ రెండు రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే అప్పుడు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details