ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACB Raids in AP: రాష్ట్రంలో ఏసీబీ దాడులు..ఎక్కడికెళ్లిన అవినీతే

By

Published : Apr 28, 2023, 1:05 PM IST

ACB Raids in AP: రాష్ట్రంలో పలు సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు అనధికారికంగా ఉన్న నగదును స్వాధీనపరచుకున్నారు. అధికారులను పూర్తి స్తాయిలో విచారించిన తర్వాత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Etv Bharat
Etv Bharat

రాష్ట్రంలో ఏసీబీ దాడులు

ACB Raids in AP : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు సబ్ రిజిస్ట్రార్, తహసిల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేసింది. 7 సబ్ రిజిస్ట్రార్​, 2 తహసిల్దార్ కార్యాలయాల్లో అనధికారంగా ఉన్న 19.28 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులను పూర్తి స్తాయిలో విచారించిన తర్వాత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

మేడికొండూరు, జలమూరు ఎమ్మార్వోలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశామన్నారు. ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏసీబీ యాప్​కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ జిల్లా, బద్వేల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి నుండి సుమారు 2,70,000, డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు 2,10,000 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీరిపై పీసీ యాక్ట్ సెక్షన్ 7 కింద కేసు చేసినట్లు తెలిపారు .

అనంతపురం రూరల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ డ్రైవర్ ఇస్మాయిల్ నుంచి రెండు లక్షలు రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఇస్మాయిల్ వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. .

నెల్లూరు జిల్లా కందుకూరు సబ్-రిజిస్ట్రార్ చాంబర్ నుండి 41,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుంచి 94,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వన్నం సతీష్ అనే డాక్యుమెంట్ రైటర్ సబ్-రిజిస్ట్రార్​కు ఆరు నెలల వ్యవధిలో ఫోన్ పే ద్వారా సుమారు 2,36,000 సబ్-రిజిస్ట్రార్ అటెండర్ ఫయాజ్​కు 1,20,000 పంపినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు అన్నారు.

తిరుపతి రూరల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద నుంచి 90,000, కార్యాలయంలో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల నుంచి 56,000, జూనియర్ అసిస్టెంట్ నుండి 9,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నర్సాపురం సబ్-రిజిస్ట్రార్ చాంబర్ లో 30,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు 20,000, ప్రైవేట్ వ్యక్తి నుంచి 6,000, సీనియర్ అసిస్టెంట్ నుంచి 9,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

జగదాంబ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి నుండి ఫోన్ పే ద్వారా మూడు విడుతలుగా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కు 90,000 పంపించినట్లు గుర్తించామన్నారు. అదే విధంగా 13 మంది డాక్యుమెంట్ రైటర్ల నుండి 39,000 రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. తుని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ వద్ద నుంచి 20,000, అనధికారంగా ఉన్న 20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

మేడికొండూరు తహసిల్దార్ కార్యాలయంలో జరిపిన తనిఖీలలో 1,04,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.జలమూర్ ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి 27,500 స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details