ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పెన్షన్లు పునరుద్ధరించకపోతే.. 30న కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం'

By

Published : Dec 28, 2022, 7:37 PM IST

Handicapped Relay Hunger: తొలగించిన దివ్యాంగుల పెన్షన్లు ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని నంద్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కూడా కొనసాగాయి.

Disability pensions
ఈ నెల 30న కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం

Second Day Continue Handicapped Relay Hunger: నంద్యాల పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో దివ్యాంగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కూడా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో రెండో రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని, మరింత ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

మాకు తొలిగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండన రోజు దీక్షను కొనసాగిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రిగారూ.. దివ్యాంగులను, వృద్ధులను, వితంతువులను దృష్టిలో ఉంచుకుని పోయిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఈ దీక్ష రేపు కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేయకపోతే.. ఈ నెల 30వ తేదీన స్థానిక కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.-గంగాధర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details