ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళ అనుమానాస్పద మృతి.. కనిపించకుండా పోయిన భర్త

By

Published : Sep 2, 2021, 7:32 AM IST

ఐదు రోజుల క్రితం ఆ దంపతులు శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో వసతి గదిలోనే భార్య శవమై కనిపించగా.. భర్త కనిపించకుండా పోయాడు. గది నుంతి దుర్వాసన వస్తుండడంతో తలుపు తెరిచి చూసిన పోలీసులకు ఆమె విగతజీవిలా కనిపించింది.

women suspicious death in srisailam
women suspicious death in srisailam

శ్రీశైలంలోని రెడ్ల సత్రానికి చెందిన నీలం సంజీవరెడ్డి నిలయంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఐదు రోజుల క్రితం వచ్చారు..

హైదరాబాద్​లో నివాసం ఉండే ప్రభాకర్, నాగరత్న దంపతులు ఐదురోజుల క్రితం శ్రీశైలం వచ్చారు. ఐదురోజులు గడిచినా వారు బయటకు రాలేదు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు తలుపు తెరిచి చూడగా.. మహిళ శవం కుళ్లిపోయి ఉంది. ఆమె భర్త మాత్రం కనిపించకుండా పోయాడు. అతణ్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

గుర్తింపు కార్డు లేకుండానే గది అద్దెకు..

సాధారణంగా శ్రీశైలంలో భక్తులు ఏదైనా గుర్తింపు కార్డులు చూపిస్తేనే మూడు రోజులు వరకు వసతి గది అద్దెకు కేటాయిస్తారు. ఎటువంటి గుర్తింపు కార్డులను తీసుకోకుండా సత్రం సిబ్బంది ఐదు రోజులు సత్రం గదులు కేటాయించారు. ప్రశ్నిస్తే తమకు తెలియదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:ఘనంగా గృహప్రవేశం..తెల్లారి లేచి చూసేసరికి షాక్​

ABOUT THE AUTHOR

...view details