ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్ధం... అంతలోనే కానరాని లోకాలకు!

By

Published : Aug 11, 2020, 3:20 PM IST

కర్నూలు జిల్లా సమీపంలోని తుంగభద్ర నది వద్ద ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన కానిస్టేబుల్​కు 4 రోజుల క్రితమే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

women constable died in road accident at kurnool district
నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్ధం... అంతలోనే కానరాని లోకాలకు

కర్నూలు జిల్లా సమీపంలోని తుంగభద్ర నది వద్ద ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీసీయం వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాధవి అనే మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. మృతి చెందిన కానిస్టేబుల్ కు నాలుగు రోజుల క్రితమే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంతలోనే మాధవి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details