ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోరకల్లులో అతిసారంతో ఇద్దరు మృతి

By

Published : Apr 6, 2021, 10:00 PM IST

అతిసారం ప్రబలుతుండటంతో కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో ఇద్దరు మృతి చెందగా ఇప్పటివరకు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

effected by diarrhea at gorakallu
గోరకల్లులో అతిసారం బారినపడి ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో అతిసారం ప్రబలింది. వాంతులు విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఉప్పరి హుస్సేన్ (65), ఎల్లా కిట్టయ్య (35) మృతి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

నాలుగు రోజులుగా దాదాపు 20 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వారంతా నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలుషిత నీటి వల్లే అతిసారం ప్రబలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details