ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yuvagalam: ఫ్యాన్‌ను పీకిపారేస్తేనే.. అన్నీ సమస్యలకు పరిష్కారం: నారా లోకేశ్

By

Published : Apr 18, 2023, 9:08 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra Latest News: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటీతో 74 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 74వ రోజు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ను పీకిపారేయడంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

lok
lok

Nara Lokesh Yuvagalam Padayatra Latest News: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనేక సవాళ్లను, అడ్డంకులను, ఆరోపణలను అధిగమిస్తూ.. 74 రోజులు పూర్తి చేసుకుంది. నేటీ పాదయాత్రలో నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024వ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ను పీకిపారేయడంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ను పీకిపారేస్తేనే కరెంటు బిల్లులు సహా రాష్ట్రంలోని అన్నీ సమస్యలకు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

నిత్యావసర ధరలు తగ్గిస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ను పీకిపారేయడమే.. కరెంటు బిల్లులు సహా రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారమని.. నారా లోకేశ్ అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో 74వ రోజూ పాదయాత్ర కొనసాగించిన యువనేత.. దేవనకొండ శివారు పొలాల్లో రైతు కూలీల కష్టాల్ని తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు తగ్గించి, జగన్ తొలగించిన పింఛన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

రుణాలిచ్చి సహకారం అందిస్తాం.. పల్లెదొడ్డి వసతి కేంద్రం నుంచి 74వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేశ్‌కు స్థానికులు సాదర స్వాగతం పలికారు. గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్‌ను పరిశీలించిన యువనేత.. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. పశువుల దాణా, మందులు, ఇతర ఖర్చులు భారీగా పెరగడంతో కనీసం కూలీ కూడా మిగలడం లేదని వాపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సబ్సిడీతో కూడిన షెడ్లు నిర్మాణం చేపట్టి, రుణాలిచ్చి సహకారం అందిస్తామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

సెల్ఫీ దిగే ధైర్యం సీఎం జగన్‌‌కు ఉందా.. నీటితో కళకళలాడుతున్న దేవనకొండ చెరువు వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్.. తెలుగుదేశం పార్టీ హయాంలో హంద్రీ నీవా జలాలతో లింక్ చేశామని గుర్తు చేశారు. పల్లె దొడ్డి, గెద్దరాళ్ల గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చామన్నారు. ఇలా సెల్ఫీ దిగే ధైర్యం సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి ఉందా.. అని ఛాలెంజ్ చేశారు. పొలంలో కూర్చొని రైతు కూలీలతో మాట కలిపిన నారా లోకేశ్‌.. వారి కష్టాలు విన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో నిత్యావసరాల ధరలు భరించలేని రీతిలో పెరిగాయని విమర్శించారు. కుంటిసాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.. ఆలూరు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు స్థానిక పాఠశాల విద్యార్థుల సమస్యల్ని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలల విలీనం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని విద్యార్థుల్నే అడిగి తెలుసుకున్న యువనేత.. సమస్య పరిష్కారిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దేవనకొండలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details