ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాఠశాలలో పాము కలకలం.. అరంగటకు పైగా అక్కడే..!

By

Published : Feb 17, 2021, 6:55 PM IST

పాఠశాలలో పాము కలకలం రేపింది. దాదాపు అరగంటకు పైగా పాఠశాల ఆవరణలో ఉన్న పాము.. అనంతరం బయటకు వెళ్లిపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగింది.

snake entered into the school
పాఠశాలలో పాము కలకలం

కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పాము కలకలం రేపింది. ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులు.. ఆఫీస్​లోకి ప్రవేశించగానే పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. సుమారు ఆరడుగులకు పైగా పాము ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. శౌచాలయంలోకి ప్రవేశించిన పాము.. అరగంట తరువాత బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. పాఠశాలలో సుమారు 180 మంది విద్యార్థులు చదువుతున్నారని.. ఇలా పాఠశాలలోకి పాములు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details