ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACB trap షేక్ హ్యాండ్ అన్న ఎస్సై.. కాదు, రెడ్ హ్యాండే అన్న ఏసీబీ

By

Published : Sep 15, 2022, 10:00 PM IST

acb

ACB Trap యూనిఫాంతోనే లంచం తీసుకుంటూ..రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు కర్నూలు జిల్లా సీ.బెళగల్ SI శివాంజల్. లంచం కోసం కాదు.. షేక్ హ్యాండ్ కోసమే చేయి ఇచ్చానని బకాయించాడు ఆ ఎస్సై. రెడ్ హ్యాండ్ గానే చిక్కావ్..కధలొద్దులే అన్నారు, ఏసీబీ అధికారులు.

ACB trap 50వేల రూపాయలు లంచం తీసుకొంటూ కర్నూలు జిల్లా సీ. బెళగల్ SI శివాంజల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. స్థలం గొడవను పరిష్కరించేందుకు ఓ భాదితుడు నుంచి 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ACB డిఎస్పీ శివ నారాయణ స్వామి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఖాకీ డ్రెస్‌లోనే లంచం తీసుకున్న శివాంజల్‌.. ACB అధికారులు పట్టుకోగానే, కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చెయ్యి కలిపానంటూ ACBఅధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details