ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.లక్ష విలువైన నగలు చోరీ...పోలీసులు విచారణ

By

Published : May 9, 2021, 8:20 AM IST

గత నెల 27న కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. రూ.లక్ష విలువైన నగలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

Rs 1 lakh worth of jewelery stolen
Rs 1 lakh worth of jewelery stolen

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో రూ.లక్ష విలువైన నగలు చోరీకి గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎర్రబావిగడ్డవాసులైన దేవేంద్ర, జయమ్మకు చెందిన నగలు గతనెల 27న ఇంట్లోనే చోరీకి గురయ్యాయి. బంగారం ఉంగరం, కమ్మలు, 22 తులాల వెండి ఆభరణాలు, రూ.12100 నగదు కనిపించకుండా పోయాయి.

ఈనెల 2న చోరీ విషయం గుర్తించిన బాధితులు కుటంబ సభ్యులు, ఇరుగుపొరుగువారిని విచారించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. శనివారం పీఎస్సై మమత, సిబ్బంది వచ్చి గృహాన్ని పరిశీలించి బాధితులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details