ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆందోళన

By

Published : Sep 30, 2021, 4:08 PM IST

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు సంఘాలు, కార్మికులు ఆందోళన ఆందోళన చేపట్టారు. ప్రదాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

protest at karnulu market
protest at karnulu market

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని.. కార్మికులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. మార్కెట్​లో పనిలేనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కార్మికులు తెలిపారు. ఉల్లి విక్రయాలు లేనందున.. రైతులు తమ పంటను తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారని, చేనులోనే ఉల్లి పాడైపోతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి... మార్కెట్లో బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details