ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నల్లమల అడవుల్లో చిరుతపులుల వేట.. ముగ్గురు అరెస్ట్​

By

Published : Jan 26, 2021, 12:16 PM IST

శ్రీశైలంలోని నల్లమల అడవుల్లో చిరుతపులులను వేటాడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి చిరుతపులి చర్మం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Police have arrested three people
నల్లమల అడవుల్లో చిరుతపులుల వేట

శ్రీశైలంలోని నల్లమల అడవుల్లో చిరుతపులులను వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన నిందితులు జడ్డా నాగరాజు, రావెల సురేష్, దోర్నాలకు చెందిన జడి సునీల్.. అనే వ్యక్తులు నల్లమల అడవుల్లో చిరుతపులుల వేట సాగిస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ, డబ్ల్యూ.సీ.సీ అధికారులు.. నిఘా పెట్టి నిందితులను చిరుతపులి చర్మంతో సహా పట్టుకున్నారు. ఇటీవల ఒక చిరుతపులి కూన కళేబరం లభించినప్పటి నుంచి నిఘా పెంచినట్టు పోలీసులు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో శ్రీశైలం సమీప అడవుల్లో జీవించే చిరుతపులులు బాహాటంగానే సంచరించిన విషయం ఫోటోలు, వీడియోల ద్వారా వెలుగుచూసిందని... ఈ అవకాశాన్ని అదునుగా చేసుకొని వేటగాళ్లు వేట సాగిస్తున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details