ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

By

Published : Dec 26, 2020, 3:56 PM IST

కర్నూలు జిల్లా ముగతి - నందవరం రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident one dead
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతి - నందవరం రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ప్రేమ రాజు (30 )అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా వెళుతూ ఒకదానిని ఇంకొకటి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు నందవరం మండలంలోని ముగతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details