ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్బ్రాంతి

By

Published : Apr 20, 2022, 4:50 PM IST

Updated : Apr 20, 2022, 5:46 PM IST

తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. కారు టైరు పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ మృతి
రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ మృతి

తెదేపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్దకు చేరుకోగానే.. టైరు పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాజవర్థన్‌రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజవర్థన్‌రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!

Last Updated : Apr 20, 2022, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details