ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nominations: మా జడ్పీటీసీ అభ్యర్థిని వైకాపా నాయకులు ఎత్తుకెళ్లారు: జనసేన

By

Published : Nov 5, 2021, 6:47 PM IST

Updated : Nov 5, 2021, 10:08 PM IST

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన జనసేన అభ్యర్థిని వైకాపా నాయకులు ఎత్తుకెళ్లారని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మార్కండేయులు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Kolimigundla JSP ZPTC Candidate
జడ్పీటీసీ అభ్యర్థిని ఎత్తుకెళ్లిన వైకాపా శ్రేణులు

జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు జనసేన పార్టీ తరఫున పృధ్వీరాజ్ నామినేషన్ వేసేందుకు కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లగా.. వైకాపా నాయకులు అడ్డుకున్నారని జనసేన రాష్ట్ర కో-ఆర్డినేటర్ మార్కండేయులు పేర్కొన్నారు.

'కొలిమిగుంట్ల జడ్పీటీసీ అభ్యర్థి ఎర్రబోతుల వెంకట రెడ్డి మృతిచెందడంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయడంలేదని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చెప్పారు. ఈ విషయంపై అధిష్టానంతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంతలోనే తమ పార్టీకి చెందిన వ్యక్తిని కారులో వైకాపా నాయకులు ఎత్తుకెళ్లారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోంది అని మార్కండేయులు విమర్శించారు.

ఇదీ చదవండి:TIFFIN FOR RS.10: పది రూపాయలకే టిఫిన్.. టేస్ట్​ అదుర్స్​

Last Updated :Nov 5, 2021, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details