ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Srisailam Reservoir:ఎగువ నుంచి శ్రీశైలానికి 21,458 క్యూసెక్కుల ప్రవాహం

By

Published : Jul 16, 2021, 9:30 AM IST

శ్రీశైలం ప్రాజెక్టుకు 21, 458 క్యూసెక్కుల ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 806.80 అడుగులకు చేరగా... నీటినిల్వ 32.468 టీఎంసీలుగా నమోదైంది.

flood flow coming to srisailam reservoir
flood flow coming to srisailam reservoir

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 21,458 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 806.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 32.468 టీఎంసీలుగా కొనసాగుతోంది. 24 గంటల్లో ఎడమ జల విద్యుత్ కేంద్రంలో 3.126 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరగగా..విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details