ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crocodile halchal in crop field: వరి కోస్తుండగా పొలంలో మొసలి కలకలం

By

Published : Dec 7, 2021, 7:15 PM IST

Crocodile halchal in crop field: కర్నూలు జిల్లా కౌతాళం మండలం మరళి గ్రామంలో వరి పోల్లాలో మొసలి కలకలం రేపింది. వరికోత యంత్రంతో వరి కోయిస్తుండగా పొలంలో మొసలి కనిపించింది. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అన్నదాతలు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ మొసలిని నదిలోకి తరిమివేశారు. రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణనష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు.

crocodile halchal in crop field
పొలంలో ముసలి కలకలం

వరి పోల్లాలో మొసలి కలకలం

నదులు, చెరువుల్లో సంచరించే మొసలి వరి పొలాల్లో కనిపించింది. యంత్రంలో వరి పొలం కోయించేందుకు వెళ్లి రైతులకు అది తారసపడడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. దానిని చూసి తలో దిక్కు పరుగు తీశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం మరళి గ్రామంలో జరిగింది. అప్రమత్తమైన మరికొంత మంది రైతులు చాకచక్యంగా వ్యవహరించి దానిని పక్కనే ఉన్న నదిలోకి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details