ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి

By

Published : Apr 21, 2020, 12:30 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 184 మందికి వైరస్ సోకింది.

corona cases raised to 757 in ap
corona cases raised to 757 in ap

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 35 పాజిటివ్ కేసులను అధికారులు నిర్ధరించారు. వీటితో సహా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కు చేరింది. గడచిన 24 గంటల్లో 5022 నమూనాలను పరీక్షించగా 35 మందికి కోవిడ్ 19 పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు.

కొత్తగా కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, కడప జిల్లాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 22కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 96 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 639 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details