ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దేశ రెండో రాజధాని కర్నూలులో పెట్టాలి: టీజీ వెంకటేశ్​

By

Published : Jun 9, 2020, 6:13 PM IST

దేశ రెండో రాజధానిగా కర్నూలు చెయ్యాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్​ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే చేకూర్చేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​, వామపక్షాలు మనుగడ కోల్పోయాయన్నారు. మోదీ కాకుండా వేరే ఎవరైనా ప్రధానిగా ఉంటే దేశ పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

దేశ రెండో రాజధాని కర్నూలులో పెట్టాలి: టీజీ వెంకటేశ్​
దేశ రెండో రాజధాని కర్నూలులో పెట్టాలి: టీజీ వెంకటేశ్​

దేశ రెండో రాజధాని కర్నూలులో పెట్టాలని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్​ పేర్కొన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు శాశ్వత ప్రయోజనాలు కల్పించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వడం కంటే విద్యుత్‌తో నడిచే ఆటోలు ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారికి ధైర్యం చెప్పే నాయకత్వం లేదన్నారు.

రాష్ట్రంలో పోలవరం మినహా... శాశ్వత ప్రయోజనాలు కల్పించే ప్రాజెక్టులే లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తుందని టీజీ స్పష్టం చేశారు. ప్రధానిగా మోదీ కాకుండా వేరే వారు ఆ స్థానంలో ఉండి ఉంటే దేశ పరిస్థితి దారుణంగా ఉండేదని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. మోదీ ప్రధానిగా రెండోసారి పదవి చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్​ ప్రధాని అయితే పారిపోయి ఉండేవారని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలతో మోదీ దౌత్య సంబంధాలు మెరుగుపరిచారని గుర్తు చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details