ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి

By

Published : May 19, 2020, 7:32 PM IST

కర్నూలు జిల్లా రుద్రవరం పరిధిలో గిరిజనుడిపై ఎలుగుబంటి దాడిచేసింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెదురు నరుకుతుండగా...ఈ ఘటన జరిగింది.

Bear attack on a tribal in kurnool  dst rudravaram
Bear attack on a tribal in kurnool dst rudravaram

కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం చెంచుగూడేనికి చెందిన గుర్రప్ప అనే గిరిజనుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. బాధితుడు వెదురు కోసం నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు నరుకు తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు గ్రామానికి చేరుకుని బాధితుడిని వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details