ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలపై ఆందోళన అవసరం లేదు'

By

Published : Jul 29, 2021, 7:44 PM IST

village secretariat

ప్రొబెషనరీ డిక్లరేషన్ కోసం పెట్టే పరీక్ష ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండబోదని ముఖ్యమంత్రి జగన్​ హామీ ఇచ్చినట్టు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలపై లేనిపోని గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలపై లేనిపోని గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్​ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

ప్రొబెషనరీ డిక్లరేషన్ కోసం పెట్టే పరీక్ష ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండబోదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఆర్ధిక శాఖలో ఉన్న సమస్య ను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్టు స్పష్టం చేశారు. మరోవైపు వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించటంపై ధన్యవాదాలు తెలియచేసినట్టు వివరించారు.

ఇదీ చదవండి:కొత్తగా 1,180 పోస్టులు..ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details