ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nizamabad Family Suicide Case : కుటుంబం ఆత్మహత్య కేసు.. నిజామాబాద్​కు విజయవాడ పోలీసులు

By

Published : Jan 11, 2022, 11:50 AM IST

Nizamabad Family Suicide Case : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ కుటుంబం కేసులో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇవాళ నిజామాబాద్​ వెళ్లనున్నారు. వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే నలుగురు వడ్డీ వ్యాపారులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌తో పాటు నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Telangana Family suicide Case
Telangana Family suicide Case

Nizamabad Family Suicide Case : విజయవాడలో సురేశ్​ కుటుంబం బలవన్మరణ ఘటనపై విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇవాళ నిజామాబాద్‌ వెళ్లనున్నారు. సురేశ్ కుటుంబం రాసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే నలుగురు వడ్డీ వ్యాపారులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌తో పాటు నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్ అయిన దృష్ట్యా నలుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సురేశ్‌ కుటుంబం అప్పులు, ఆస్తుల వివరాలు సేకరించనున్న పోలీసులు.. బ్యాంకు స్టేట్‌మెంట్లు, అపార్ట్‌మెంట్ వద్ద వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

Nizamabad Family Suicide Case in Updates : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విజయవాడలో నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగవంతం చేశారు. వేధింపుల ఆరోపణలతో సెక్షన్ 306 కింద నలుగురు వడ్డీ వ్యాపారులపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా.. గణేష్, వినీత, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వడ్డీ వ్యాపారుల కోసం నిజామాబాద్​కు పోలీసులు వెళ్లగా... అప్పటికే నిజామాబాద్, నిర్మల్‌లో నిందితులు పరారైనట్లు సమాచారం. నిందితుల కోసం స్థానిక పోలీసులతో కలిసి విజయవాడ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఏం జరిగింది?

Nizamabad Family Suicide Case in Telangana : విజయవాడలో తెలంగాణకు చెందిన బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా.. వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details