ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పచ్చనిచెట్టు నరకొద్దు.. ప్రయత్నిస్తే నాటొచ్చు!

By

Published : Sep 18, 2020, 9:26 AM IST

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి నోవాటెల్‌ హోటల్‌ మార్గంలో పైవంతెన రెండో దశ పనులకు అడ్డొస్తున్నాయని చెట్లను అడ్డగోలుగా నరికేస్తున్నారు. మొదటి దశ పైవంతెన పనుల సందర్భంలోనూ చెట్లు తొలగించాల్సి ఉండగా.. అప్పట్లో వేర్లతో సహా పెకిలించి మరో చోట నాటారు.

trees-cuttings-at-vijayawada-benz-circle
రహదారి పక్కన నరికిన చెట్టు

ఎండనపడి వచ్చే బాటసారులను అక్కున చేర్చుకునేలా రహదారి పక్కనే ఉన్న వృక్షాలు.. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి నోవాటెల్‌ హోటల్‌ మార్గంలో కనిపిస్తాయి. పైవంతెన రెండో దశ పనులకు అడ్డొస్తున్నాయని చెట్లపై రంపపువేటు వేస్తున్నారు. మొదటి దశ పైవంతెన పనుల సందర్భంలోనూ చెట్లు తొలగించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రభుత్వం వాటిని వేర్లతో సహా పెకిలించి రామలింగేశ్వరనగర్‌, భవానీపురంలో నాటేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు అవేమీ పట్టించుకోకుండా భారీ వృక్షాలను ముక్కలు చేయిస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details