ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'శాసనమండలిని అవమానించిన మంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదు'

By

Published : Jun 11, 2021, 9:16 PM IST

శాసనమండలిని అవమానించిన మంత్రికి పదవిలో కొనసాగే అర్హతలేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. విద్యార్థుల తరఫున పోరాడుతున్న లోకేశ్​ను విమర్శించటాన్ని సిగ్గు చేటన్నారు.

TNSF state president Pranav Gopal
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్

శాసనమండలిని దొడ్డిదారి అంటూ అవమానించిన విద్యాశాఖ మంత్రికి పదవిలో కొనసాగే అర్హతలేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. పది, ఇంటర్ పరీక్షలపై స్పష్టతలేని ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తుంటే... బాధితులపక్షాన పోరాడుతున్న లోకేశ్​ని విమర్శించటాన్ని సిగ్గుచేటన్నారు.

"విద్యాసంవత్సరం ఆలస్యమైతే విద్యార్థులు మరింతగా నష్టపోతారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు పెట్టాలనుకోవటం తగదు. ప్రైవేటు విద్యా సంస్థలకు అధిపతిగా ఉంటూ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సురేష్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు." ప్రణవ్ గోపాల్ , టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

ఇదీ చదవండి

అసత్య ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు: బాబూరావు

ABOUT THE AUTHOR

...view details