ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణా జిల్లాలో పది లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, గంజాయి స్వాధీనం

By

Published : Dec 25, 2020, 9:56 PM IST

కృష్ణాజిల్లాలో నిషేధిత గుట్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా నుంచి ఉయ్యూరుకు వెళ్తున్న లారీలో వీటిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

gutka packets and cannabis seized
గుట్కా ప్యాకెట్లు, గంజాయి స్వాధీనం

కృష్ణా జిల్లా పామర్రు మండలం అడ్డాడ సమీపంలో 10 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు..2 కిలోల గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కలకత్తా నుంచి ఉయ్యూరుకు వెళ్తున్న లారీలో వీటిని గుర్తించారు. ఈ గుట్కా లోడు ఉయ్యూరుకు చెందిన వ్యాపారి కోపూరి కాంతారావును, లారీ డ్రైవర్ తిరుమారెడ్డి శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుట్కా, రాజా ఖైనీ, మాణిక్ చంద్​ను సప్లై చేసిన ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన గణేష్, హైదరాబాద్​కు చెందిన లారీ యజమానిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details