ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై నిలబెట్టి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది'

By

Published : Jul 14, 2020, 10:18 PM IST

అస్మదీయులు, తస్మదీయులని రెండు వర్గాలుగా విడదీసి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విజయవాడలో దుయ్యబట్టారు. తప్పుడు పనులు చేస్తున్న వారికి కొమ్ముకాస్తున్నారన్నారు.

TDP politburo member Varla Ramaiah
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రభుత్వం ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టి ఒకరికి అగ్రతాంబూలం అందిస్తూ, మిగిలనవారిని వేధింపులకు గురిచేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నడిరోడ్డులో నిలబెట్టి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఏమిటో జగన్ కు తెలుసా అని నిలదీశారు. 'తప్పుడు పనులు చేసేవారిని వదిలేస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది' అని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details