ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kondapalli Municipal Chairman: ఛైర్మన్ ఎన్నికపై తొలగని సందిగ్ధత.. మళ్లీ వాయిదా

By

Published : Nov 23, 2021, 10:50 AM IST

Updated : Nov 23, 2021, 5:40 PM IST

ఛైర్మన్ ఎన్నికపై తొలగని సందిగ్ధత

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై (Kondapalli Municipal Chairman Elections) ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నిన్న గందరగోళ పరిస్థితుల్లో నేటికి వాయిదా పడ్డ ఎన్నిక..ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని వైకాపా కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు. మరోవైపు..ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ తెలుగుదేశం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం..విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అధికారులకు విచారణకు హాజరై ఎన్నిక తీరుపై వివరించారు. అనంతరం కోర్టు బుధవారం చైర్మన్​ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది.

ఛైర్మన్ ఎన్నికపై తొలగని సందిగ్ధత.. మళ్లీ వాయిదా

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapally Municipal Chairman Elections news) క్షణానికో మలుపు తిరుగుతోంది. నిన్న గందరగోళ పరిస్థితుల్లో నేటికి వాయిదా పడ్డ ఎన్నిక..ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇవాళ ఉదయం ఎక్స్‌అఫిషియో సభ్యులతో సహా వైకాపా, తెలుగుదేశం కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బల్లలు చరస్తూ న్యాయం కావాలంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. కార్యాలయం బయటకు వచ్చి ఆందోళన కొనసాగించారు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని.., ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకొస్తున్న వైకాపా కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. కార్యాలయం బయట వైకాపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎన్నిక ప్రక్రియ అడ్డుకునేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని తెలుగుదేశం ఆరోపించింది.

మరోవైపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక రెండో రోజూ వాయిదా పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు.

ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ తెలుగుదేశం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగా అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ కోర్టుకు రావాలని ఆదేశించింది. అధికారులు కోర్టుకు హాజరై ఎన్నిక వాయిదా పడిన తీరును వివరించారు. అనంతరం కోర్టు బుధవారం కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:

Kondapalli Municipal Chairman Election: వైకాపా కౌన్సిలర్ల వీరంగం.. ఛైర్మన్ ఎన్నిక వాయిదా...

Last Updated :Nov 23, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details