ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్ని ప్రమాదంపై తెదేపా నేతల విచారం

By

Published : Aug 9, 2020, 2:49 PM IST

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి పట్ల తెదేపా నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.

tdp leaders condolence on Vijayawada fire broken in swarna pales covid care center
tdp leaders condolence on Vijayawada fire broken in swarna pales covid care center

విజయవాడలో అగ్నిప్రమాదంపై ఎంపీ కేశినేని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో కొవిడ్ బాధితులు మృతి చెందటంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప విస్మయం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలన్నారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే విజయవాడలో కొవిడ్ సెంటర్​లో అగ్నిప్రమాదం జరిగిందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కొవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించటం దురదృష్టకరమన్నారు. వైద్యం కోసం వచ్చి చనిపోవడం తీవ్ర బాధాకర మన్నారు.

ABOUT THE AUTHOR

...view details