ఆంధ్రప్రదేశ్

andhra pradesh

javahar: 'పేదల కన్నీటి ప్రవాహంలో.. వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది'

By

Published : Jul 22, 2021, 2:04 PM IST

'తాడేపల్లి ప్యాలెస్ వద్దనున్న నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పంపించేస్తున్నారు" అని తెదేపా నేత జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాలెవ్వరూ తనచుట్టూ ఉండకూడదనే రీతిలో జగన్ వ్యవహారం ఉందని.. మండిపడ్డారు.

tdp leader javahar comments on cm jagan
తెదేపా నేత జవహర్

ముఖ్యమంత్రి జగన్ తన ప్యాలెస్ చూట్టూ ఉన్న పేదల్ని నిర్మూలించేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. పేదలు, బడుగు బలహీన వర్గాలెవ్వరూ తనచుట్టూ ఉండకూడదనే రీతిలో జగన్ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉందని భావించేందుకు.. తన కంటికి పేదలు కనిపించకుండా చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

స్టే ఉన్నా పేదల ఇళ్ల తొలగింపు చేపట్టారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తాడేపల్లి ప్యాలెస్ వద్దనున్న.. నిరాశ్రయులకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పేదల కన్నీటి ప్రవాహంలోనే ..వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details