ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగ్గయ్యపేటలో 'స్వామిత్వ యోజన' సర్వే ప్రారంభం

By

Published : Sep 17, 2020, 3:44 PM IST

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సమాచార వ్యవస్థను మెరుగుపరచడం కోసం చేపట్టిన 'స్వామిత్వ యోజన' కార్యక్రమానికి నమూనా గ్రామాలుగా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రనిపేట ఎంపికయ్యాయి. ఇక్కడి ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయనున్నారు.

Swamitva yojana survey start in krishna district jaggaiahpeta
Swamitva yojana survey start in krishna district jaggaiahpeta

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత, డిప్యూటీ కలెక్టర్ ధ్యాన్‌చంద్‌ జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రనిపేట గ్రామాల్లో 'స్వామిత్వ యోజన' సర్వే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్‌ కెమెరాల సాయంతో గ్రామంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను నమోదు చేసే కార్యక్రమాలు ఈ సర్వే ద్వారా జరగనుంది. ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, చెరువులు తదితర అంశాల కచ్చితమైన కొలతలను ఈ కార్యక్రమం ద్వారా నమోదు చేస్తారు. ఈ నమూనా గ్రామాల్లో వచ్చిన ఫలితాలను బట్టి దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే కార్యాచరణతో అధికారులు ముందుకు సాగుతారు.

ABOUT THE AUTHOR

...view details