ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏసీబీ వలలో కృష్ణా సహకార బ్యాంకు సీఈవో

By

Published : Oct 30, 2019, 2:53 PM IST

అతనో సహకార బ్యాంకు సీఈవో. స్టేషనరీ కాంట్రాక్టు కోసం ఆర్డర్​ ఇచ్చేందుకు ఓ ప్రింటింగ్​ ప్రెస్​ యజమాని నుంచి లక్ష రూపాయలు లంచం డిమాండ్​ చేశారు. దీనిపై ప్రెస్​ యజమాని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అనిశా అధికారులు వలపన్ని ఆ బ్యాంకు అధికారి ఆట కట్టించారు.

ఏసీబీ వలలో కృష్ణా జిల్లా సహాకార బ్యాంకు సీయీఓ

ఏసీబీ వలలో కృష్ణా జిల్లా సహాకార బ్యాంకు సీయీఓ

ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమాని వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా సహకార బ్యాంకు సీఈఓ ఎన్. రంగబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 2020 సంవత్సర క్యాలెండర్లు, డెయిరీల ముద్రణకు సంబంధించి రూ.7.58 లక్షల ఆర్డర్​ ఇచ్చేందుకు ఐదు లక్షలు లంచం డిమాండ్​ చేశారని ప్రెస్​ యజమాని నాంచారయ్య ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల పథకం ప్రకారం నాంచారయ్య... బ్యాంకు సీఈవోకు డబ్బులు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సోమంచి సాయికృష్ణ తెలిపారు.

sample description

ABOUT THE AUTHOR

...view details