ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్​ బ్యాలెట్​ బాక్సుల ఏర్పాటు

By

Published : Feb 7, 2021, 12:48 PM IST

ఈనెల 9న తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.

postal ballot boxes
పోస్టల్​ బ్యాలెట్​ బాక్సుల ఏర్పాటు

తొలి విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాల పంచాయతీలకు పోస్టల్​ బ్యాలెట్​ బాక్సులు అందించారు.

నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో లక్ష్మీలీలలు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండలంలో ఎన్నికల విధులకు పాల్గొనే 60మంది ఉద్యోగులు ఓటు వేసుకునేందుకు వీలుగా వారికి పోస్టల్ బ్యాలెట్లు అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో పంచాయతీల వారీగా పోస్టల్​ బ్యాలెట్ ఓట్లను అధికారులు పంపించే ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:సర్పంచ్ ఎన్నికల బరిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

ABOUT THE AUTHOR

...view details