ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ దాడి... గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పనిగా పోలీసుల అనుమానం

By

Published : Dec 23, 2020, 10:44 AM IST

ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఆపి.. కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆగంతకుల చేతిలో గాయపడిన యువకుడు మహేశ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గంజాయి లేదా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

blade batch attack on young man
యువకుడిపై కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి

యువకుడిపై కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి

విజయవాడలో పాల ఫ్యాక్టరీ వద్ద బైక్ పై వెళ్తున్న మహేష్ అనే యువకుడిపై కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. సీసీ టీవీల్లో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దుండగుల చేతిలో గాయపడిన మహేష్ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి.. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట పీఎస్​లో బాధితుడి తండ్రి పిర్యాదు చేశారు. విజ్ఞానదీప్‌ అనే వ్యక్తిపై తమకు అనుమానాలు ఉన్నాయని అతనే ఈ దాడి చేయించి ఉంటాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దాడికి కారణం పాత గొడవలా లేక బ్లేడ్ బ్యాచ్ వంటి ఇతర ముఠాల పనా.. ఇతర కారణలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details