ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ILLICIT LIQUOR: నాటు సారా స్థావరంపై దాడి.. నిందితుల అరెస్ట్

By

Published : Oct 9, 2021, 11:19 AM IST

కృష్ణా జిల్లాలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ILLICIT LIQUOR
ILLICIT LIQUOR

కృష్ణాజిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులో నిషిద్ధ నాటు సారా తయారుచేస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. కొల్లేరు లంక గ్రామమైన పందిరిపల్లి గూడెంలో అక్రమంగా సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసు బృందాలు దాడి చేాశాయి. ఈ దాడుల్లో ఇద్దరు నిందితులను అందుపులోకి తీసుకున్నారు.

ILLICIT LIQUOR

స్థావరంపై దాడి చేసిన సమయంలో తయారు చేసి ఉన్న 50 లీటర్ల నాటుసారా, 800 లీటర్ల బెల్లపు ఊట, సారా తయారీకి వినియోగించే సామగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details