ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'దళితులు, మహిళలపై దాడులను అరికట్టండి'

By

Published : Oct 5, 2020, 8:02 PM IST

విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ, కాంగ్రెస్, తెదేపా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

opposition parties conducted round table meeting in vijayawada
విజయవాడలో విపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేందుకు... ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రి వద్దకు ఓ ప్రతినిధుల బృందం వెళ్లి చర్చించాలని తీర్మానించాయి. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జస్టిస్ రామకృష్ణ హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, వినయకుమార్‌, ఇతర ప్రజా సంఘాలు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అభివృద్ధిలో ముందుండాల్సిన రాష్ట్రం... అరాచకాలలో ముందు వరుసలో ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ క్రైం బ్యూరో... విడుదల చేసిన లెక్కలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, అఖిలపక్ష నేతలతో చర్చించాలని కోరారు.

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి వర్గంలో పదవుల కోసమే దిల్లీకి జగన్: దేవినేని

ABOUT THE AUTHOR

...view details