ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఒక ఎంపీకే ఇలా అయితే.. సామాన్యుల పరిస్థితి ఎంటి?'

By

Published : Jan 21, 2020, 4:26 PM IST

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సమయంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అరెస్టయిన ఆయన బెయిల్​పై విడుదలయ్యారు.

MP Galla jayadev expressed outrage over the way the police dealt with him
పోలీసుల తీరుపై ఎంపీ గల్లా అసంతృప్తి

పోలీసుల తీరుపై ఎంపీ గల్లా అసంతృప్తి

రైతులతో కలిసి శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సమయంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులతో కలిసి శాంతియుతంగా నిరసన చేస్తుండగా పోలీసులు లాఠీఛార్జి చేశారని, రాళ్లు విసిరారని ఆరోపించారు. తనకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి నిరసన చేసుకునే హక్కు ఉందన్నారు. అసెంబ్లీ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తుంటే... పోలీసులు దారుణంగా ప్రవర్తించారన్నారు. పోలీసులు తనపైనా లాఠీఛార్జ్ చేయబోతే ...రైతులు, మహిళలు కాపాడారని తెలిపారు. గ్రామీణ ఎస్పీ విజయరావు లాఠీతో పరుగెత్తుకుని వచ్చారని... తనని కూడా కొడతారని భయపడ్డానని వివరించారు.

అరెస్టు చేసిన తర్వాత చాలాసేపటి వరకు గుంటూరు జిల్లా మొత్తం తిప్పి.. ఆ తర్వాత న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలతో తనకు గాయాలైనా... జీపులోనే వైద్య పరీక్షలు చేసి జైలుకి పంపారని తెలిపారు. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే... సామాన్యులు పరిస్థితి ఏంటని అయన ప్రశ్నించారు. పోలీసులు తెలివిగా సీఆర్పీఎఫ్ బలగాలతో లాఠీఛార్జి చేయిస్తున్నారని... కేంద్ర బలగాలు కాబట్టి వారిపై చర్యలుండవని ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details