ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాగల మూడ్రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

By

Published : Apr 28, 2021, 4:12 PM IST

రాగల మూడ్రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతిలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర సహా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడనున్నట్లు వివరించింది.

రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

తూర్పు బిహార్ నుంచి దక్షిణ ఒడిశా వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడటంతో వర్ష సూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.6 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం చెందింది. ఫలితంగా రాగల మూడ్రోజులు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షం కురవనుంది.

ఉరుములు మెరుపులతో...

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు రాయలసీమలో తేలికపాటి వర్షం కురిసే అవకాశమున్నట్లు వివరించింది. ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడనుంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి :ప్రజల ప్రాణాలు హరించి.. శ్మశానాలకు రాజులుగా ఉంటారా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details