ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పంటను అమ్ముకోవడానికి దళారుల ప్రమేయం ఉండదు'

By

Published : Nov 19, 2020, 9:06 PM IST

దళారులని ప్రమేయం లేకుండా పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమమే సీఎం ధ్యేయమని తెలిపారు.

mailavarm mla
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. భారీ వర్షాల వల్ల రైతన్నలు నష్టపోకుండా ప్రభుత్వం అనేక నివారణ చర్యలు తీసుకుందని తెలిపారు.

దళారులని ప్రమేయం లేకుండా పంటను అమ్ముకునేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details